విజయ్ కండిషన్ కి ‘నో’ చెప్పిన ప్రొడ్యూసర్

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో విజయ్ బాగా డల్ అయ్యాడు. అందుకే తను నెక్స్ట్ చేయబోయే [more]

Update: 2019-08-22 08:18 GMT

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో విజయ్ బాగా డల్ అయ్యాడు. అందుకే తను నెక్స్ట్ చేయబోయే సినిమాలపై రీఎనాలిసిస్‌ చేయడం స్టార్ట్ చేసాడు. ఈనేపథ్యంలోనే హీరో అనే సినిమాని ఆపేసాడు విజయ్. కాకపోతే క్రాంతి మాధవ్ చేస్తున్న చిత్రం ని మాత్రం ఆపలేకపోతున్నాడు. కారణం ఈమూవీ పెళ్లి చూపులు తరువాత ఒప్పుకుంది కాబట్టి. అప్పటికి ఇప్పటికి విజయ్ చాలా ఎదిగాడు.

ఇది పక్కన పెట్టి పూరి తో సినిమా చేసి ఆ తరువాత క్రాంతి మాధవ్ సినిమా చేద్దాం అనుకుంటున్నాడు విజయ్. కానీ అందుకు ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు అంగీకరించలేదు. సడన్ గా ఈచిత్రం ఆపేస్తే విజయ్‌కే నమ్మకం లేదని సినిమా కిల్‌ అయిపోతుందని, అంచేత ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాతే ఏ సినిమా అయినా చేయాలనీ రామారావు గట్టిగా చెప్పడంతో విజయ్ కూడా సరే అని ఈ సినిమాను త్వరత్వరగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు. ఎట్టలేదన్న క్రాంతి మాధవ్ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో అయ్యే అవకాశముంది. సో అప్పటికి వరకు పూరి ఖాళీగా ఉండక తప్పదు.

Tags:    

Similar News