ఫ్లాప్‌ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..?

తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ [more]

Update: 2019-05-25 07:39 GMT

తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నుండి స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. వరుస కమిట్మెంట్స్ ఉన్న విజయ్ కి మరో డైరెక్టర్ లైన్ లో ఉన్నాడు. అతనే హ‌ను రాఘ‌వ‌పూడి. నానితో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, శర్వాతో 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'చేసి ఫ్లాప్‌తో ఢీలా పడ్డ హనుకి ఆ తరువాత అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందు రాలేదు.

లవ్ స్టోరీతో విజయ్ సినిమా

వైజ‌యంతీ అనుబంధ సంస్థ స్వ‌ప్న సినిమాస్‌తో విజ‌య్ ఓ సినిమా చేయాలి. అయితే ఇప్పటివరకు విజయ్ స్వ‌ప్న సినిమాస్‌లో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, మ‌హాన‌టి రెండు సినిమాలు చేసాడు. ఒప్పందం ప్ర‌కారం మూడో సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమాను హనుతో చేయించాలని స్వప్న భావిస్తుంది. హను రీసెంట్ గా ఓ లవ్ స్టోరీ రాసుకున్నాడట. మిల‌ట‌రీ నేప‌థ్యంలో సాగే ఈ ల‌వ్ స్టోరీలో విజ‌య్ అయితే బాగుంటాడ‌ని హ‌ను కూడా భావిస్తున్నాడ‌ట‌. మరి ఈ సినిమాను ఓకే చేసాడో లేదో చూడాలి.

Tags:    

Similar News