విజయ్ దేవరకొండ టైటిల్ పై రచ్చ..!

నిన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ టైటిల్ ను నాని పెట్టుకున్నాడని మెగా ఫ్యాన్స్ కస్సుబుస్సులాడారు. అలాగే మరో నిర్మాత తన సినిమాకి గ్యాంగ్ లీడర్ [more]

Update: 2019-03-14 06:35 GMT

నిన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ టైటిల్ ను నాని పెట్టుకున్నాడని మెగా ఫ్యాన్స్ కస్సుబుస్సులాడారు. అలాగే మరో నిర్మాత తన సినిమాకి గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్నాక విక్రమ్ కుమార్ – నాని ఎలా తమ సినిమాకి అదే టైటిల్ పెట్టుకుంటారనే రచ్చ టాలీవుడ్ సాక్షిగా మీడియాకెక్కింది. తాజాగా మరో చిరు టైటిల్ పై రచ్చ మొదలయ్యేలా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్స్ వారు ‘హీరో’ అనే టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమిళంలోనూ ఓ సినిమా…

అయితే అదే టైటిల్ తో తాజాగా మరో తమిళ హీరో తన సినిమాని పట్టాలెక్కించేసాడు. బుధవారం తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా పూజ కార్యక్రమాలతో మొదలైన సినిమాకి కూడా దర్శకనిర్మాతలు ‘హీరో’ అనే టైటిల్ నే పెట్టారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండకి, శివ కార్తికేయన్ కి మధ్య కూడా ఈ టైటిల్ రచ్చ మొదలయ్యేలా కనబడుతుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు తమ సినిమా టైటిల్ మార్చుకోవాలి. తమిళనాట ఒకే టైటిల్ తో ఇద్దరు హీరోలు పోటీపడడం కుదరదు. కాబట్టి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు వెనెక్కి తగ్గి టైటిల్ మార్చుకుంటారో చూడాలి. అయినా హీరో టైటిల్ చిరంజీవికి తప్ప మరెవరికీ కలిసి రాలేదు. గతంలో నితిన్ కూడా చిరు టైటిల్ హీరోని తీసుకుని సినిమా చేయగా డిజాస్టర్ అయ్యింది. మరి ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఈ హీరో టైటిల్ ఎంతవరకు కలిసొస్తుందో చూద్దాం.

Tags:    

Similar News