పూరి సినిమాలో విజయ్ లుక్?

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ సినిమా మొదలయ్యిందో… లేదో.. చకచకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు పూరి. ఛార్మి కూడా సినిమాని ప్రమోట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ [more]

Update: 2020-03-01 14:25 GMT

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ సినిమా మొదలయ్యిందో… లేదో.. చకచకా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు పూరి. ఛార్మి కూడా సినిమాని ప్రమోట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ తో కలిసి తనని తాను ప్రమోట్ చేసుకుంటుందో కానీ.. పూరి – విజయ్ సినిమా విషయాలను ఛార్మి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాకి చేరవేస్తుంది. పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ కి జోడిగా నటిస్తుంది. అయితే పూరి – విజయ్ సినిమా టైటిల్ గాని, ఆ సినిమా లుక్స్ విషయాలు గాని ఇంతవరకు బయటిరాలేదు. అయితే తాజాగా పూరి – విజయ్ దేవరకొండ మూవీ పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ లీకెడ్ పిక్స్ లో విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నట్లు కనిపిస్తుంది. అదే బైక్ మీద అనన్య పాండే బైక్ ముందు భాగంలో విజయ్ కి ఎదురుగా కూర్చుని ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం కొన్ని రిస్క్ యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శిస్తున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ఫీలర్లు వదులుతుంది. ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో కరణ్ జోహార్ టీం కనుసన్నల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరియు ఇతరులపై యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాడు. మరి ఆ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా విజయ్, అనన్య బైక్ మీదున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News