విజయ్ స్పీడు మాములుగా లేదే!

ఈ ఏడాది డియర్ కామ్రేడ్ తో పాటుగా, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో హడావిడి చేస్తాడనుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ని వచ్చే ఏడాది [more]

Update: 2019-12-06 06:38 GMT

ఈ ఏడాది డియర్ కామ్రేడ్ తో పాటుగా, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో హడావిడి చేస్తాడనుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరికి మార్చాడు. ఈ ఏడాది డియర్ కామ్రేడ్ పోవడంతో… కాస్త స్లో అయిన విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది మాత్రం వరసగా సినిమాలను లైన్ లోపెట్టేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్నాడు. ఇక మజిలీ దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమాకి కమిట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో దర్శకుడు, నిర్మాతకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సదరు దర్శకనిర్మాతలు ఆ సినిమా ని పట్టాలెక్కించడానికి రేడి అవుతున్నారని సమాచారం.

అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ తో దిల్ రాజు సినిమా నిర్మించాలనుకోవడం, మధ్యలో విజయ్, దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చాడనే ప్రచారం జరగడంతో.. దిల్ రాజు – విజయ్ దేవరకొండ కాంబో ఇక ఉండదని కూడా అన్నారు. కానీ దిల్ రాజు – విజయ్ కాంబో వచ్చే ఏడాది మొదట్లో అంటే పూరి తో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమా చేస్తున్నప్పుడే దిల్ రాజు – హుషారు దర్శకుడితో సినిమా మొదలెట్టి.. ఫైటర్ తో పాటుగా పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే హుషారు దర్శకుడు స్క్రిప్ట్ పూర్తి చేసి కూర్చున్నాడని, దిల్ రాజు కూడా రెడీ గా ఉండడంతో.. విజయ్ – దిల్ రాజు ల సినిమా ఆన్ కార్డ్స్ అంటున్నారు. మరి మజిలీ డైరెక్టర్ శివ తో నాని టక్ జగదీశ్ పూర్తయ్యేలోగా.. విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలను పూర్తి చేసి శివ తో సినిమా మొదలెడతాడట.

Tags:    

Similar News