ఈసారి విజయ్ మరో అవతారమెత్తాడు..!

ప్రస్తుతం యంగ్ హీరోస్ కి, స్టార్ హీరోస్ కి గట్టి పోటీ ఇస్తున్న విజయ్ దేవరకొండ నుండి సినిమా అప్ డేట్ వస్తుంది అంటే.. ఆయన అభిమానులకే [more]

Update: 2019-01-30 08:28 GMT

ప్రస్తుతం యంగ్ హీరోస్ కి, స్టార్ హీరోస్ కి గట్టి పోటీ ఇస్తున్న విజయ్ దేవరకొండ నుండి సినిమా అప్ డేట్ వస్తుంది అంటే.. ఆయన అభిమానులకే కాదు మిగతా ప్రేక్షకులకి ఎంతో ఆసక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు, బేవార్స్ కుర్రోడిగా, స్టూడెంట్ అండ్ డాక్టర్ గా, కాలేజ్ లెక్చరర్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యే పాత్రల్నే చేస్తున్న విజయ్ దేవరకొండ.. మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో స్టూడెంట్ గా అదరగొట్టేయ్యబోతున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో తనకు అచ్చొచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

సింగరేణి కార్మికుడిగా…

ఇక భరత్ కమ్మ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ… క్రాంతి మాధవ్ డైరెక్షన్ లోనూ మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేసుకుంది. క్రాంతి మాధవ్ – విజయ్ దేవరకొండ కాంబోకి ఇంకా టైటిల్ అయితే పెట్టలేదు కానీ.. షూటింగ్ మాత్రం కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో శరవేగంగా జరుపుకుంటుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి అంటే బొగ్గు గనుల కార్మికుడిగా కనిపించబోతున్నాడట.

ఇద్దరు హీరోయిన్లతో…

ఇప్పుడు ఆ సింగరేణి కి సంబందించిన సన్నివేశాలని కొత్తగూడెం బొగ్గు గనుల్లోనే చిత్రీకరిస్తున్నారట. కాకపోతే సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ సినిమాలో కొంతమేర మాత్రమే కనిపిస్తాడట. మిగిలినదంతా క్లాస్ లుక్ లోనే కనిపిస్తాడని చెబుతున్నారు. మరి ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నాతో పాటుగా మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఎంపికయ్యిందని సమాచారం.

Tags:    

Similar News