మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ..!

రెండుమూడు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ [more]

Update: 2019-03-15 06:39 GMT

రెండుమూడు సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో రీసెంట్ గా హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018’ లిస్ట్ లో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. హైదరాబాద్ లో ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, రానా, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ ఎంతో మంది ఉంటే వారిని దాటేసి విజయ్ మొదటి స్థానం దక్కించుకున్నాడు.

చెన్నైలోనూ మూడో స్థానంలో…

గత ఏడాది రెండో స్థానంలో ఉన్న విజయ్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరాడు. గత ఏడాది విజయ్ రెండో స్థానం అయితే మొదటి స్థానంలో నిలిచిన మోడల్ బసీర్ అలీ ఈసారి 5వ స్థానం లో నిలిచాడు. మరోవైపు చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు 2018లో విజయ్ మూడవ స్థానంలో నిలిచి తెలుగులోనే కాదు తమిళంలో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’తో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News