విజయ్ హిట్ సినిమాకి సీక్వెల్..!

Update: 2018-12-03 06:11 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో బాగా ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ... గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ హీరో అయ్యాడు. గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ, పిల్లలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను పడేసి 100 కోట్ల హీరో గా అవతరించాడు. అర్జున్ రెడ్డి తర్వాతే విజయ్ యాటిట్యూడ్ పూర్తిగా మారగా... గీత గోవిందం హిట్ తో అది మరింత రెట్టింపైంది. అయితే ఆ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు పరశురామ్ కన్నా ఎక్కువగా విజయ్ దేవరకొండకే పేరొచ్చింది. పరశురామ్ టేకింగ్, డైరెక్షన్ స్కిల్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి.

గీత గోవిందం సీక్వెల్ తీద్దాం...

మరి గీత గోవిందం తర్వాత పరశురామ్ మరో ప్రాజెక్ట్ ని ఇంతవరకు ఎనౌన్స్ చెయ్యలేదు. అంత భారీ హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ నెక్స్ట్ మూవీపై ఎటువంటి క్లారిటీ లేదు. అయితే పరశురామ్ దగ్గర రెండు మూడు కథలున్నప్పటికీ... ఈమధ్యనే పరశురామ్ ని కలిసిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సీక్వెల్ చేద్దాం రెడీగా ఉండు అని చెప్పాడట. ఇక ప్రస్తుతం ఏ హీరోతో కమిట్ అవ్వాలో తెలియని పరశురామ్.. విజయ్ దేవరకొండ చెప్పినట్టుగానే గీత గోవిందం సీక్వెల్ కి స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఏడాదిన్నర ఆగాల్సిందే..!

అయితే ఆ సీక్వెల్ కూడా మళ్లీ గీత గోవిందం అనే టైటిల్ తో ఉండబోతుందని... అలాగే గీత గోవిందం జంట రష్మిక తోనే విజయ్ దేవరకొండ నటించబోతున్నానంటూ ఫిలింనగర్ టాక్. మరి విజయ్ దేవరకొండ చెబితే పరశురామ్ గీత గోవిందం సీక్వెల్ అంటూ బయలుదేరడం కాస్త వింతే. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరి పరశురామ్ ఎంతగా గీత గోవిందం 2 స్క్రిప్ట్ రెడీ చేసినా.. విజయ్ దొరకాలంటే మరో ఎడాదిన్నర ఆగాల్సిందే. హిట్ హీరో విజయ్ దేవరకొండ కమిట్మెంట్స్ మాములుగా లేవు కదా. ఈలోపు పరశురామ్ పరిస్థితి ఏమిటో కదా...!

Similar News