విజయ్ పక్కన బ్రెజిల్ భామ..?

Update: 2018-10-13 06:37 GMT

కేవలం రెండుమూడు సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యిపోయాడు విజయ్ దేవేరుకోండ. చాలా తక్కువ కాలం ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ రీసెంట్ గా చేసిన 'నోటా' డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రౌడీ ఫ్యాన్స్ విజయ్ నెక్స్ట్ మూవీస్ 'ట్యాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్'ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే రిలీజ్ అవ్వనున్నాయి. ఇది ఇలా ఉండగా విజయ్ త్వరలో రెండు మూడు సినిమాల్లో నటించనున్నాడు. అందులో ఒకటి 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు.

బ్రెజిల్ భామ కూడా...

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాలో ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ లు ఎంపిక అయ్యారు. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్ కూడా ఓకే అయిందంట. కేఎస్ రామారావు నిర్మించబోతోన్న ఆ చిత్రంలో విజయ్ సరసన రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేశ్ తో పాటు ఇజా బెల్లీలీట్ అనే బ్రెజీల్ మోడల్ కూడా విజయ్ సరసన నటిస్తోందట. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుందంట. ఇందులో విజయ్ ట్రిపుల్ పోజ్ లో నటించబోతున్నాడని సమాచారం. దసరా రోజు అంటే అక్టోబర్ 18న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని లాంచ్ చేయబోతున్నారట.

Similar News