గోవిందుడి సరసన గీత కాదు… ప్రీతి..!

గీత గోవిందం సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. డియర్ [more]

Update: 2019-05-12 07:36 GMT

గీత గోవిందం సినిమాతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న కలిసి మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. డియర్ కామ్రేడ్ సినిమాపై వీరిద్దరి వల్లే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డియర్ కామ్రేడ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా… అని విజయ్ ఫ్యాన్స్.. అదేనండి విజయ్ అభిమాన రౌడీస్ ఎదురు చూస్తున్నారు. మరి గీత గోవిందం హిట్ తర్వాత మళ్లీ రష్మిక మందాన్నని రిపీట్ చేసిన విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి రష్మికతో కలిసి నటించబోతున్నాడని న్యూస్ నడుస్తుంది. ఆనంద్ అన్నామ‌లై‌ దర్శకత్వంలో విజయ దేవరకొండ నటించబోతున్న తెలుగు, తమిళ సినిమాలో విజయ్ మళ్లీ రష్మికతో జోడీ కడుతున్నాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.

మళ్లీ పాత భామతోనే..

అయితే తాజాగా గీతని కాదని.. ఆర్జున్ రెడ్డి భామ షాలిని పాండేతో విజయ్ మరోసారి నటించబోతున్నాడంటున్నారు. అర్జున్ రెడ్డిలో ప్రీతీ పాత్రలో విజయ్ దేవరకొండతో కలిసి లిప్ లాక్స్ తో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయిన షాలిని పాండేతో విజయ్ మళ్లీ జోడి కడితే ఆ క్రేజే వేరు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెష‌న‌ల్ బైక‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి హీరో అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారట.

Tags:    

Similar News