బాలీవుడ్ ప్రేమంతా విజయ్ మీదే

టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ లో అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క హీరోయిన్ కూడా విజయ్ దేవరకొండ పక్కన [more]

Update: 2019-12-05 05:07 GMT

టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ లో అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క హీరోయిన్ కూడా విజయ్ దేవరకొండ పక్కన ఛాన్స్ కోసం తహతహలాడుతుంది. టాలీవుడ్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కి, విజయ్ దేవరకొండ స్టయిల్ కి బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సలాం కొడుతున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్ బోల్డ్ భామ కియారా అద్వానీ విజయ్ తో సినిమా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తా అంది. ఇక లేలేత అందాల జాన్వీ కపూర్ కూడా తనకి విజయ్ దేవరకొండ అంటే ఇష్టమంది.

తాజాగా టాలీవుడ్ సీతమ్మ, బాలీవుడ్ హాట్ గర్ల్ అలియా భట్ విజయ్ దేవరకొండ స్టయిల్ కి పడిపోయా అంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలో తనకి మోస్ట్ గ్లామరస్ స్టార్స్ లో హీరోయిన్ అనుష్క శర్మ ఇష్టమని, అదే హీరోల్లో అయితే అని అనగానే అందరూ ఏ రణ్వీర్ సింగో, ఏ రణబీర్ కపూర్ పేరో చెబుతుంది అనుకుంటే టక్కున రౌడీ విజయ్ దేవరకొండ అని చెప్పింది. మరి విజయ్ దేవరకొండ స్టయిల్ అండ్ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందొ ఈ హీరోయిన్స్ విజయ్ ని పొగడడంతో అర్ధమవుతుంది. అందుకే విజయ్ కూడా బాలీవుడ్ పై మక్కువ చూపుతూ…. అక్కడి వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాడు.

Tags:    

Similar News