మళ్లీ మాయ చేసేలా కనిపిస్తున్నాడుగా..!

Update: 2018-06-23 08:45 GMT

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ... ఆ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అలాగే అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రఫ్ లుక్ తో కేర్ లెస్ కాలేజీ కుర్రాడిగా విజయ దేవరకొండ నటనకు యూత్ ఫిదా అయ్యారు. అప్పటి నుండి విజయ్ దేవరకొండ ని అందరూ అర్జున్ రెడ్డిగా అభివర్ణిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి లా తన యాటిట్యూడ్ ని మార్చేసుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ కొత్త ప్రోజెక్టుల మీద ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాక్సీవాలా విడుదల కావాల్సి ఉండగా, గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీతగోవిందం చేసాడు.

మీ బరువు బాధ్యత నాదే మేడమ్...

అయితే గీత గోవిందం సినిమా లో విజయ్ దేవరకొండ లుక్ బయటికి వచ్చింది. ఫస్ట్ లుక్ తోనే... అభిమానులను ఫ్లాట్ చేశాడు విజయ్. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికతో కలిసి ఉన్న విజయ్ దేవరకొండ గీత గోవిందం లుక్ కి అభిమానులే కాదు యూత్ మొత్తం పడిపోయారు. లుక్ పోస్టర్ తో పాటుగా విజయ్ దేవరకొండ ఒక ఇంట్రస్టింగ్ కామెంట్ కూడా పెట్టాడు. ఆ పిక్ తోపాటుగా విజయ్.. ‘నా కాళ్ళు తిమ్మిరి ఎక్కినా... నడుము నొప్పి లేచినా.... మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్’ అని కామెంట్ చూసిన ఎవ్వరైనా విజయ్ దేవరకొండ మళ్ళీ కొత్తగా మొదలెట్టేసాడుగా అనిపిస్తుంది.

విజయ్ కాళ్లపై రష్మిక...

పరశురామ్ డైరెక్షన్ లో ఈ సినిమాని చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టేస్తాడంటున్నారు గీత గోవిందం ఫస్ట్ లుక్ చూసిన వారు. విజయ్ దేవరకొండ చిన్న గెడ్డం స్టైలిష్ లుక్ తో తన కాళ్ల మీద రష్మికని కూర్చోబెట్టుకుని ఆమె వైపు నవ్వుతూ చూస్తుండగా, రష్మిక కూడా నవ్వుతూ కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. మరి గీత గోవిందం పేరు పాటగా ఉన్నప్పటికీ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కావాల్సినన్ని ఉంటుందనేది ఈ పోస్టర్ లోనే తెలియజేసారు.

Similar News