విజయ్ కాదంటే రామ్ దగ్గరకొచ్చిందా..?

విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజియెస్ట్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో. చేసినవి తక్కువ సినిమాలే అయినా… విజయ్ కి బోలెడంత క్రేజ్ [more]

Update: 2019-01-05 06:38 GMT

విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజియెస్ట్ హీరోల సరసన చేరిన యంగ్ హీరో. చేసినవి తక్కువ సినిమాలే అయినా… విజయ్ కి బోలెడంత క్రేజ్ వచ్చేసింది. అలాంటి హీరోతో ఒకప్పటి స్టార్.. ప్రస్తుతం ఫ్లాప్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు. అందులో భాగంగానే పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండకి కథ వినిపించడానికి కాకినాడ కూడా వెళ్లినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ డేట్స్ ఖాళీ లేక మరో హీరో రామ్ తో పూరీ ఒక సినిమాని మొదలెట్టేసాడు. విజయ్ కన్నా ముందే రామ్ ని పూరీ లైన్ లో పెట్టాడు.

విజయ్ బిజీగా ఉండటంతోనే

తాజాగా రామ్ – పూరీ కాంబో టైటిల్ అనౌన్సమెంట్ కూడా జరిగింది. రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమా పేరు ఇస్మార్ట్ శంక‌ర్‌. అయితే ఈ సినిమా కథ ముందు విజయ్ దేవరకొండకి పూరీ వినిపించాడని… విజయ్ ఖాళీ లేక అదే కథ తో రామ్ తో చేస్తున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. డియర్ కామ్రేడ్ తో కాస్త బిజీగా ఉన్న విజయ్ ఫ్రీ అయ్యేవరకు ఆగలేని పూరీ జగన్నాధ్… హీరో రామ్ తో ఈ సినిమా మొదలెట్టేస్తున్నాడట. అయితే ప్రస్తుతం రామ్ కి మర్కెట్ పడిపోయింది. ఇక పూరీకి దర్శకుడిగా అస్సలు మర్కెట్ లేదు. మరి ఇలాంటి టైంలో ఐస్మార్ట్ శంక‌ర్‌ కి ఏ మేర బిజినెస్ జరుగుతుందో.. అలాగే ఈ కాంబో మీద ఎలాంటి అంచనాలు క్రియేట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News