ఒకదాని తర్వాత మరొకటి వాయిదాలు..!

Update: 2018-09-18 06:14 GMT

వచ్చే నెల 4న విడుదల కావాల్సిన 'నోటా' చిత్రం వాయిదా పడింది. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 18 కు వెళ్లింది ఈ చిత్రం. అందుకు కారణం నిర్మాత జ్ఞానవేల్ అని తెలుస్తుంది. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిన ఈ సినిమాను తెలుగులో 30 కోట్ల దాకా ఆశించడంతో ఇక్కడ బయ్యర్లు మాత్రం పాతిక కోట్లకు మించి ఆఫర్ చేయలేకపోతున్నారట. అందుకే రాజా వెనక్కి తగ్గి అక్టోబర్ 18న విడుదల చేయనున్నాడు. ఈ లోపు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేస్తే.. ఆ హైప్ తో సినిమాను ఎక్కువ రేట్ కు అమ్ముకోవచ్చని భావిస్తున్నాడు.

రవితేజ సినిమా కూడా...

అయితే ఇది అసలు కారణం కాదని, రీ రికార్డింగ్ ఆలస్యం అవ్వడంతో సినిమాను వాయిదా వేస్తున్నారని పైకి చెప్పినా అది నిజం కాదని కామెంట్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటె రవితేజ నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' కూడా అక్టోబర్ 5 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు కానీ ఇప్పుడు కాస్త అనుమానంగానే ఉంది. మరి ఏమైందో ఏమిటో తెలియదు కానీ ఈ చిత్రం డిసెంబర్ 14 కు వాయిదా పడినట్టు తెలుస్తుంది.

దసరాకు భారీ పోటీ

ఇలా ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో చిన్న సినిమాలు లైన్ క్లియర్ అవ్వడమే కాదు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాయి. శ్రీ విష్ణు, నారా రోహిత్ ఇద్దరు కలిసి నటిస్తున్న 'వీర భోగ వసంత రాయలు', అలీ తమ్ముడు ఖయ్యుమ్ హీరోగా నటించిన 'దేశంలో దొంగలు పడ్డారు'కి లైన్ క్లియర్ అయింది. ఇక అక్టోబర్ 18న రామ్ 'హలో గురు ప్రేమ కోసమే', విశాల్ 'పందెం కోడి 2' ఆల్రెడీ రేస్ లో ఉన్నాయి. మరి వీటితో పాటు 'నోటా' కూడా పోటీకి సిద్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈసారి దసరా ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ ఉండటం కచ్చితం అని అర్ధం అవుతుంది.

Similar News