విజయ్ దేవరకొండ అవార్డుకు భారీ ధర

Update: 2018-07-16 09:16 GMT

అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తన సేవాభావాన్ని అప్పుడప్పుడూ చూపిస్తుంటాడు. తాజాగా ఆయనకు దక్కిన ఫిలిం ఫేర్ అవార్డును వేలం వేసి ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన తన అవార్డును వేలం వేశారు. దివి ల్యాబ్స్ నిర్వాహకులు శకుంతల దివి, కిరణ్ దివవి ఈ అవార్డును రూ.25 లక్షలకు కొనుగోలు చేశారు.

రూ.5 లక్షలు అడిగితే...

అయితే, ఈ అవార్డు కోసం విజయ్ దేవరకొండ రూ.5 లక్షలకు కొనుగోలు చేయాలని విజయ్ దివి ల్యాబ్స్ వారిని కోరారంట. అది అర్జున్ రెడ్డి సినిమాకు విజయ్ అందుకున్న రెమ్యునరేషన్ తో సమానం. అయితే, ఈ సేవవాభావంతో విజయ్ ఈ కార్యక్రమం చేస్తున్నందున దివి ల్యాబ్ వారు రూ.25 లక్షలు ఇస్తామని, అవార్డు కూడా విజయ్ వద్దే ఉంచుకోవాలని కోరారు. కానీ, దివి ల్యాబ్ వారు చేసిన ఈ సహాయం సంస్థ ఉద్యోగులకు తెలియాలనే ఉద్దేశ్యంతో అవార్డును సంస్థ వద్దే పెట్టుకోవాలని విజయ్ కోరారు. దీంతో రూ.25 లక్షలను విజయ్ దేవరకొండ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.

Similar News