ఫైటర్ డాన్ కొడుకా?

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కనున్న మాస్ మసాలా మూవీ త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం క్రాంతి మాధవ దర్శకత్వంలో సింగరేణి కార్మికుడిగా, సాఫ్ట్ [more]

Update: 2019-09-09 08:29 GMT

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కనున్న మాస్ మసాలా మూవీ త్వరలోనే పట్టాలెక్కడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం క్రాంతి మాధవ దర్శకత్వంలో సింగరేణి కార్మికుడిగా, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత పూరి తో సెట్స్ మీదకెళ్తాడు. పూరి – విజయ్ సినిమా టైటిల్ కూడా ఇదే అంటూ ఫైటర్ టైటిల్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. అయితే టైటిల్ తో పాటుగా ఇంకా హీరోయిన్ సెట్ చెయ్యని ఈ సినిమా కథ మీద ఓ ఇంట్రెస్టింగ్
పాయింట్ బయటికి వచ్చింది.

డాన్ కొడుకుగా….

మంచి స్టోరీ లైన్ తో విజయ్ దేవరకొండ ని మెప్పించిన పూరి జగన్నాధ్…విజయ్ తోచెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ లో నిమగ్నమయ్యాడు. అయితే పూరి, విజయ్ కి చెప్పిన స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ లైన్ తెరమీదకొచ్చింది. అదేమిటంటే విజయ్ దేవరకొండ ఈ సినిమా లో ఓ డాన్ కి కొడుకుగా నటిస్తున్నాడట. అలాగే ఆ డాన్ కి కొడుక్కి మధ్యన నడిచే కథనే సినిమాగా మలిచాడట పూరి. ఇక విజయ్ కి తండ్రిగా ఆ డాన్పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని చెబుతున్నారు.

 

 

Tags:    

Similar News