ఫైటర్ కూడా రెడీ అంటున్నాడు

నిన్నమొన్నటివరకు కరోనా తో షూటింగ్స్ మొత్తం మూలానపడినాయి. ఇప్పుడిప్పుడే కరోనా ని దాటుకుని సెట్స్ మీదకెళుతున్నాయి. మీడియం హీరోలెప్పుడో షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక భారీ [more]

Update: 2020-09-21 06:22 GMT

నిన్నమొన్నటివరకు కరోనా తో షూటింగ్స్ మొత్తం మూలానపడినాయి. ఇప్పుడిప్పుడే కరోనా ని దాటుకుని సెట్స్ మీదకెళుతున్నాయి. మీడియం హీరోలెప్పుడో షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక భారీ బడ్జెట్ చిత్రాలే ఇంకా పట్టాలెక్కలేదు. ఆచార్య కానీ, RRR కానీ, పుష్ప కానీ, రాధేశ్యాం కానీ.. ఇంకా షూటింగ్ మొదలెట్టుకోలేదు. ఇక పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ లా ఫైటర్ మూవీ కూడా ముందుకు కదల్లేదు. తాజాగా ఫైటర్ కూడా అక్టోబర్ 10 నుండి షూటింగ్ మొదలు బెట్టుకోబోతుందట. అయితే ముంబై లో ఇంకా కరోనా తో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇలాంటి టైం లో ముంబై లో జరగాల్సిన ఫైటర్ షూటింగ్ ఎలా జరుగుతుందో అనే అనుమానం అందరిలో ఉంది.

అయితే పూరి జగన్నాధ్ ఫైటర్ షూటింగ్ ని హైదరాబాద్ లోనే ఓ సెట్ వేసి అందులో విజయ్ మీద యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చేయబోతున్నాడట. అందుకు ఇప్పటికే ఆ సెట్ నిర్మాణం చేపట్టారని.. ఈ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగాక మిగిలిన షూటింగ్ కోసం పూరి ఛార్మి – విజయ్ లు ముంబై ఫ్లైట్ ఎక్కుతారట. ఇక షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే ఓ మంచి ముహూర్తం చూసుకుని విజయ్ దేవరకొండ – అనన్య పాండే లు నటించబోయే పాన్ ఇండియా మూవీ టైటిల్ ని మూవీ టీం ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ ఇప్పటికి ఫైటర్ లుక్ నే కంటిన్యూ చెయ్యడం వలన పూరి ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టిన విజయ్ సిద్దమన్నమాట.

Tags:    

Similar News