హీరోగా.. నిర్మాతగా కూడా ఫెయిల్!

విజయ్ దేవరకొండ హీరో గా ఈఏడాది డియర్ కామ్రేడ్ తో బాగా దెబ్బతిన్నాడు. డియర్ కామ్రేడ్ మీద నమ్మకంతో విజయ్ రెచ్చిపోయి ప్రమోషన్స్ లో గ్రెస్ చూపించి [more]

Update: 2019-11-06 06:09 GMT

విజయ్ దేవరకొండ హీరో గా ఈఏడాది డియర్ కామ్రేడ్ తో బాగా దెబ్బతిన్నాడు. డియర్ కామ్రేడ్ మీద నమ్మకంతో విజయ్ రెచ్చిపోయి ప్రమోషన్స్ లో గ్రెస్ చూపించి బాగా హడావిడి చేసాడు. అయితే ఆ సినిమా విజయ్ అనుకున్నంత హిట్ కాలేదు. ఆ దెబ్బకి పూరి లాంటి డైరెక్టర్ కి కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ… నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమా చేసాడు. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఈ ఏడాది హీరోగా.. నిర్మాతగా సక్సెస్ చూడలేని విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాల విషయంలో తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

మీకు మాత్రమే చెప్తా సినిమా ప్లాప్ మెయిన్ గా విజయ్ దేవరకొండ మీదే పడింది. నిర్మాణ విలువల్లో క్వాలిటీ లేదని అన్నారు. కానీ విజయ్ దేవరకొండ తండ్రి మాత్రం విజయ్ మీకు మాత్రమే చెప్తా సినిమాకి బడ్జెట్ పెట్టాడని, నిర్మాణ విలువల్లో లోపాలేం లేవని కవర్ చేస్తున్నాడు కానీ.. విజయ్ నిర్మాణ విలువల విషయంలో బాగా పిసినారి తనం మైంటైన్ చేసాడని అన్నారు. మరి విజయ్ తదుపరి చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రం పై ఈ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త పడినా.. విజయ్ కి ఆ సెగ తగలక మానదని, ఇక విజయ్ తో సినిమాలు తీసే నిర్మాతలు కూడా అలోచించి నిర్మాణ విలువల్లో కోత పెడితే మాత్రం కష్టమే అంటున్నారు

Tags:    

Similar News