అర్జున్ రెడ్డి షేడ్స్ కనబడుతున్నాయే..

Update: 2018-12-02 04:52 GMT

విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన మెడికల్ స్టూడెంట్ పాత్ర కెరీర్ లోనే బెస్ట్ అనిపించేలా ఉంది. దర్శకుడు సందీప్ వంగా అర్జున్ రెడ్డి కేరెక్టర్ ని విజయ్ దేవరకొండకి సరిపోయేలా డిజైన్ చేసాడు. విజయ్ కూడా తన యాటిట్యూడ్ తో మొడొకో కేరెక్టర్ ని ఇరగదీసాడు. అసలా పాత్రని ఒప్పుకోవాలంటే హీరోలకు చాలా గట్స్ ఉండాలి. ఆ పాత్రతోనే విజయ్ కి యూత్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే విజయ్ దేవరకొండ మరోసారి ఇలాంటి అంటే మెడికల్ స్టూడెంట్ పాత్రలోనే కనిపించబోతున్నాడట.

అది కూడా విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ లో విజయ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ మీద కొన్ని కాలేజ్ సన్నివేశాలను కాకినాడ మెడికల్ కాలేజ్ లో చిత్రీకరిస్తున్నారు. మరి మరోసారి మెడికోగా విజయ్ దేవరకొండ అదరగొడతాడన్నమాట. మరి హీరోయిన్ రశ్మిక కూడా స్టూడెంట్ గా మహిళా క్రికెటర్ గా డియర్ కామ్రేడ్ లో కనిపించబోతోంది. ఇక రశ్మికకి సంబందించిన కొన్ని క్రికెట్ సీన్స్ కూడా కాకినాడ కాలేజ్ గ్రౌండ్స్ లో చిత్రీకరిస్తున్నారు.

దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రేమ, ఎమోషన్స్ అన్నికలగలిపి ఉంటాయని.... మరోసారి విజయ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమంటున్నారు విజయ్ ఫాన్స్.

Similar News