రూమర్స్ కి చెక్ పెట్టిన ‘డియర్ కామ్రేడ్’ టీం!

విజయ్ దేవరకొండ ఫైనల్ అవుట్ ఫుట్ పై అంత సంతృప్తిగా లేడు అందుకే ‘డియర్ కామ్రేడ్’ మళ్లీ రీషూట్ చేస్తుంది అన్న వార్తలకు టీం చెక్ పెట్టింది. [more]

Update: 2019-04-28 11:07 GMT

విజయ్ దేవరకొండ ఫైనల్ అవుట్ ఫుట్ పై అంత సంతృప్తిగా లేడు అందుకే ‘డియర్ కామ్రేడ్’ మళ్లీ రీషూట్ చేస్తుంది అన్న వార్తలకు టీం చెక్ పెట్టింది. నిన్న ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని గుమ్మడి కాయ కొట్టేసింది. దాంతో ఇప్పటివరకు వచ్చినవి అన్ని రూమర్స్ అని అర్ధం అయిపోయింది. నిన్న టీం మొత్తం కలిసి ఫోటో దిగి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని పోస్ట్ చేయడంతో ఈ గాసిప్స్ కి బ్రేక్ పడినట్లు అయింది.

‘గీత గోవిందం’ తరువాత మళ్లీ విజయ్ రష్మిక మందన్నతో చేస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. పైగా లేటెస్ట్ గా రిలీజ్ అయినా టీజర్ లో యాక్షన్ బిట్ తో పాటు లిప్ లాక్ సీన్ ఓ రేంజ్ లో వైరల్ అయిపోయి యూత్ లో అంచనాలు అమాంతం పెంచేసింది. దీన్ని కొత్త దర్శకుడు భరత్ కమ్మ అనే అతను డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి సంస్థతో బిగ్ బెన్ కలిసి సంయుక్తంగా నిర్మించింది.

ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఫుల్ బిజీ కానుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 31 న ఈసినిమా రిలీజ్ అవ్వబోతుంది. త్వరలోనే ‘డియర్ కామ్రేడ్’ టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనుంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈసినిమా స్టూడెంట్ పాలిటిక్స్ లో సెన్సిబుల్ లవ్ స్టొరీని జోడించి ఓ విభిన్నమైన ప్రయత్నం చేసినట్టుగా టాక్ ఉంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News