కామ్రేడ్ ని తోక్కేసిన శంకర్

భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఏకంగా నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదలైన డియర్ కామ్రేడ్ కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. విజయ్ [more]

Update: 2019-08-01 05:38 GMT

భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఏకంగా నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదలైన డియర్ కామ్రేడ్ కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో నిర్మాతలు గట్టెక్కేస్తారు, ఫస్ట్ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. మొదటి వీకెండ్ లో ఫర్వాలేదనిపించిన డియర్ కామ్రేడ్ వసూళ్లు ఇప్పుడు వీక్ డేస్ లో వీకైపోయాయి. సోమా, మంగళ, బుధవారాల్లో డియర్ కామ్రేడ్ వసూళ్లు చూస్తే తెలుస్తుంది. ఇక డియర్ కామ్రేడ్ కన్నా ముందు వారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ జోరు మాత్రం తగ్గలేదు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేని ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు యావరేజ్ తో సరిపెట్టుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కి చేరిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్.. దర్శకుడు పూరి, ఛార్మి, హీరోయిన్ నిధి చేసే భారీ ప్రమోషన్స్ తో సెకండ్ వీక్ లోను డియర్ కామ్రేడ్ ని తట్టుకుని మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ , రష్మిక చేసిన ప్రమోషన్స్ తో పోలిస్తే ఇస్మార్ట్ విడుదలకు ముందు ప్రమోషన్స్ వీక్ గా ఉన్నాయి. కానీ ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాక పూరి అండ్ కో చేసే ప్రమోషన్స్ తో ఇస్మార్ట్ మీద ఇంకా ఆసక్తి జనాల్లో పెరిగింది. ఇక పూరి అండ్ టీం ఇప్పటికి ఇస్మార్ట్ ప్రమోషన్స్ ని ఊరూరా భారీగా నిర్వహిస్తున్నారు. ఇక డియర్ కామ్రేడ్ టాక్ వీకవడంతో ఇస్మార్ట్ కి ఇంకా కలిసొచ్చింది.మొదట్లో విజయ్ క్రేజ్ తో డియర్ కామ్రేడ్ ఇస్మార్ట్ ని తొక్కేస్తాడనుకుంటే….. ఇప్పుడు డియర్ కామ్రేడ్ ని ఇస్మార్ట్ తొక్కేసాడు.

Tags:    

Similar News