క్రేజ్ నిలుపుకునే ఆరాటంలో విజయ్ దేవరకొండ..?

Update: 2018-11-22 08:37 GMT

ఈ ఏడాది నోటా సినిమా ఫ్లాప్ అయినా.. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఏ మాత్రం హైప్ లేని టాక్సీవాలాతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ మీద దర్శకనిర్మాతలకు మాత్రమే కాదు... యూత్ లోను భారీ క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి హిట్ ఒక ఎత్తైతే... గీత గోవిందం హిట్ మరో ఎత్తు. ఇక టాక్సీవాలా కేవలం విజయ్ క్రేజ్, కథలోని బలంతోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ తో విజయ్ మీద అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఇప్పుడొచ్చిన క్రేజ్ ని విజయ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఇప్పుడు సీరియస్ గా రంగంలోకి దిగినట్లుగా అనిపిస్తుంది.

ఒక సినిమా తర్వాతే మరో సినిమా...

ఇంతకు ముందు ఎడాపెడా సినిమాలు చేసుకుంటూపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మాత్రం ఒక సినిమా తర్వాతనే మరో సినిమా చేస్తానని చెబుతున్నాడు. ఎందుకంటే గీత గోవిందం సినిమాతో పాటుగా నోటా, టాక్సీవాలా సినిమాలు చెయ్యడంతో.. నోటా మీద టాక్సీవాలా మీద పూర్తి దృష్టి పెట్టలేకపోవడంతో... కాస్త ఇబ్బంది పడ్డానని చెబుతున్నాడు. ఇకమీదట మాత్రం ఆలా ఉండదంటున్నాడు. అందుకే ప్రస్తుతం టాక్సీవాలా విజయంతో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ మీద మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తన మీదున్న అంచనాలకు తగట్టుగా విజయ్ ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా రషెస్ చూసి కొద్దిగా వీక్ అనిపించిన సీన్స్ మళ్లి రీ షూట్ చేపిస్తున్నాడట.

డైరెక్షన్ లోనూ జోక్యం...

మరి ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేసుకున్న డియర్ కామ్రేడ్ లో కొన్ని సీన్స్ విజయ్ కి పెద్దగా నచ్చకపోవడం వలన ఇలా ఆయా సీన్స్ ని రీ షూట్ చేపిస్తున్నాడట. ఇప్పటివరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వేలు పెట్టకయినా... ప్రస్తుతం తన మీదున్న క్రేజ్, అంచనాలు నిలుపుకోవాలంటే కొన్ని చెయ్యాలని డిసైడ్ అయ్యి.. విజయ్ ఇలా చేస్తున్నాడట. ఇక ఇప్పటివరకు దర్శకనిర్మాతలు చెప్పింది విన్న విజయ్ ఇలా కొత్తగా చేయడంతో అతని క్రేజ్ దృష్టిలో ఉంచుకుని... డియర్ కామ్రేడ్ దర్శకుడు కూడా విజయ్ చెప్పింది చెయ్యడానికి రెడీ అవుతున్నాడట.

Similar News