అంత కాన్ఫిడెంటా?

విజయ్ దేవరకొండ కి స్టార్ ఇమేజ్ వచ్చాక.. యాటిట్యూడ్ లో చాలా చేంజ్ వచ్చింది. రౌడీ ఫ్యాన్స్ అంటూ విజయ్ దేవరకొండకి స్పెషల్ ఫ్యాన్స్ రావడం.. విజయ్ [more]

Update: 2020-02-08 05:43 GMT

విజయ్ దేవరకొండ కి స్టార్ ఇమేజ్ వచ్చాక.. యాటిట్యూడ్ లో చాలా చేంజ్ వచ్చింది. రౌడీ ఫ్యాన్స్ అంటూ విజయ్ దేవరకొండకి స్పెషల్ ఫ్యాన్స్ రావడం.. విజయ్ క్రేజ్ బాలీవుడ్ కి పాకడంతో.. విజయ్ దేవరకొండ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లెవల్లో ఫోజులు కొడుతున్నాడనిపిస్తుంది. లేదంటే రెండు మూడు లవ్ స్టోరీలు చేసిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ నే లాస్ట్ లవ్ స్టోరీ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. మరి పూరి జగన్నాధ్ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ హీరోగా అయిపోతే అని కలలు కంటున్నాడనిపిస్తుంది.

మరి పూరి చేతిలో పడ్డారంటే.. మాస్ ఇమేజ్ వచ్చేసినట్టే. కాకపోతే కొందరి హీరోలకి సెట్ అయిన పూరి స్టయిల్.. మరికొందరికి తేడా కొట్టింది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ క్రేజ్ తోనే బాలీవుడ్ నుండి సౌత్ వరకు ఓ మూవీని పట్టాలెక్కించాడు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ అప్పీల్ చూసి మాస్ ఫ్యాన్స్ విజయ్ ని ఎత్తేస్తారని కాన్ఫిడెన్స్ తో విజయ్ ఉన్నాడనిపిస్తుంది. అందుకే ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని చెబుతున్నాడు. మరి పూరి కథకి అందుకే కనెక్ట్ అయ్యాడేమో విజయ్ దేవరకొండ. ఆ కథ మాస్ కి దగ్గరగా ఉండడంతో విజయ్, పూరి కి కనెక్ట్ అవడం.. ఒకేసారి ఇండియా వైడ్ గా మాస్ హీరో అనిపించుకోవాలని విజయ్ బాగా ఉబలాటపడుతున్నాడని మనము డిసైడ్ అవ్వోచ్చేమో..!

Tags:    

Similar News