ఇలా చెప్పి దొరికిపోయాడుగా?

వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా పోవడానికి 100 కి 110 శాతం విజయ్ దేవరకొండ కారణం అని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చెయ్యడం కాదు….నిజంగా [more]

Update: 2020-02-20 06:58 GMT

వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా పోవడానికి 100 కి 110 శాతం విజయ్ దేవరకొండ కారణం అని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చెయ్యడం కాదు….నిజంగా వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా చూసినోళ్లకి ఆ సినిమాకి దర్శకుడు క్రాంతి మాధవ్ కి ఎలాంటి సంబంధం లేదు.. అక్కడక్కడా క్రాంతి మాధవ్ మార్క్ తప్ప సినిమా మొత్తం విజయ్ దేవరకొండ మార్కె కనబడుతుంది. సినిమాని ఇష్టం వచ్చినట్టుగా విజయ్ కెలికేసాడని.. నిర్మాత కూడా విజయ్ మీదే నిందలు వేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో గుప్పుమంది. అయినా విజయ్ దేవరకొండ సినిమా విడుదలయ్యాక సినిమాని కనీసం ప్రమోట్ చెయ్యకపోవడం కూడా నిర్మాతకి బాధ కలిగింది అనే న్యూస్ ఉంది.

అయితే విజయ్ మీద వస్తున్న ట్రోల్స్ కి విజయ్ దేవరకొండ స్పందించాడు కాదు ఖండించాడు. తానేమి దర్శకుడు పనిలో వేళ్ళు పెట్టలేదని… తన మీద వస్తున్న వార్తలన్నీ గాసిప్ అని, అసలు అందులో నిజం లేదని అదంతా అబద్దం అంటూ విజయ్ ఖండించడం చూస్తుంటే… విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ విషయంలో మిస్టేక్ చేసాడని, లేదంటే ఇలా ఎందుకు ఖండిస్తాడు అని అనడమే కాదు.. ఇలా ఖండించి అడ్డంగా దొరికిపోయాడని అంటున్నారు యాంటీ ఫాన్స్. ఇప్పటికే వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లగా.. ఇప్పుడు విజయ్ ఖండన తో ఆ సినిమాపై మరింత నెగిటివిటి కమ్ముకుంది

Tags:    

Similar News