డబ్బు ముఖ్యం కాదు

Update: 2018-10-02 06:06 GMT

అర్జున్ రెడ్డి హిట్ అప్పుడే విజయ్ దేవరకొండ పారితోషకాన్ని పెంచేశాడనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక గీత గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్బులోకి వెళ్లగానే తన పారితోషకం అమాంతం పెంచేశాడనే న్యూస్ ఉండనే ఉంది. గీత గోవిందం తర్వాత చేస్తున్న టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు గీత గోవిందం సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ లు పుచ్చుకోవడంతో.. పాత పారితోషకాన్ని కంటిన్యూ చేస్తున్న విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టుల విషయంలో దర్శకనిర్మాతలకు చుక్కలు చూపెడుతున్నాడని.. అడిగినంత ఇవ్వాలనే కండిషన్స్ పెడుతున్నాడని టాక్ నడిచింది.

ప్రతి సినిమా చివరి దానిలా...

తాజాగా విజయ దేవరకొండ తమిళంలో నటించిన నోటా సినిమా శుక్రవారం విడుదల కాబోతున్న సందర్భంగా నోటా ప్రమోషన్స్ తో విజయ్ చెన్నై టు హైదరాబాద్ ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్నాడు. అంత బిజీ షెడ్యూల్ లో నోటా ఇంటర్వూస్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండకు ఈ పారితోషకం విషయమై ప్రశ్నలు మీడియా నుండి ఎదురయ్యాయి. అయితే విజయ్ దేవరకొండ తాను పారితోషకం పెంచానని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేసాడు. అంతేకాకుండా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తాను సినిమాల్లోకి వచ్చానని.. కానీ తనకి పేరు రావడమే కాదు.. ఇప్పుడు ఇంత గొప్ప పొజిషన్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని... స్టార్ డమ్ గురించి తనకు ఆలోచన లేదని.. ఇక ప్రతి సినిమాను ఇదే నా చివరి సినిమా అనుకుని చేస్తాను అని చెప్పాడు.

కథలకే ప్రాధాన్యత

ప్రతి సినిమా విషయంలో ఎంతో కష్టపడతానని... సినిమా హిట్ అయింది కదా అని పారితోషకం పెంచేద్దాం అనే ఆలోచనే తనకి ఉండదని.. రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తే సినిమాలు చేయలేమని అంటున్న ఈ యంగ్ హీరో.. రెమ్యునరేషన్ పక్కనపెట్టి కథల విషయంలో కొత్తగా ఆలోచించడం వలనే తానూ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. మరి గీత గోవిందం బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నోటా తో హిట్ అందుకుంటే అతని క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది.

Similar News