కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విజయ్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిన్న డైరెక్టర్స్ నుండి పెద్ద డైరెక్టర్స్ వరకు అందరితో సినిమాలు చేయనున్నాడు విజయ్. చిన్న [more]

Update: 2019-02-06 10:20 GMT

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చిన్న డైరెక్టర్స్ నుండి పెద్ద డైరెక్టర్స్ వరకు అందరితో సినిమాలు చేయనున్నాడు విజయ్. చిన్న డైరెక్టర్స్ కి కూడా విజయ్ ఆఫర్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ…“నేను కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం కాదు, వాళ్లు నా దగ్గరకి వచ్చి కథ చెప్పడం నా అదృష్టం” అని చెప్పాడు. అలా అన్నాడో లేదో వెంటనే ఓ కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చేసాడు. రీసెంట్ గా ‘హుషారు’ అనే సినిమాతో యూత్ ని ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్ హర్షతో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు.

రెండు సినిమాల తర్వాత…

అతని టాలెంట్ నచ్చి వెంటనే ఓ కథ రెడీ చేయి మనం సినిమా చేద్దాం అని చెప్పాడట. అంతా సెట్ అయితే నా నెక్స్ట్ సినిమా నీతోనే అని చెప్పాడట. డైరెక్టర్ శ్రీహర్ష ఈ విషయాన్ని ఇటీవలే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో ఉన్నాడు. ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగించుకుని క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత హర్షతో సినిమా ఉండే అవకాశముంది.

Tags:    

Similar News