విజయ్ దేవరకొండకి 48 కోట్ల ఆఫరా?

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ రేంజ్ కి చేరిన హీరో విజయ్ దేవరకొండ. రౌడి బ్రాండ్ తో భీభత్సమైన పాపులారిటీ సంపాదించిన విజయ్ దేవరకొండ [more]

Update: 2019-12-20 05:51 GMT

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ రేంజ్ కి చేరిన హీరో విజయ్ దేవరకొండ. రౌడి బ్రాండ్ తో భీభత్సమైన పాపులారిటీ సంపాదించిన విజయ్ దేవరకొండ స్టయిల్ కి టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ పరిచింది. బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ ని తలదన్నేలా రౌడీ బ్రాండ్ అంటూ విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో పాతుకుపోయేలాకనిపిస్తున్నాడు. ఇప్పటికే కరణ్ జోహార్ తో స్నేహం, పూరి ఫైటర్ ని పాన్ ఇండియా ఫిలిం గా మార్చడం, బాలీవుడ్ హీరోయిన్స్ అంతా విజయ్ స్టయిల్ కి పడిపోవడం అమ్మో ఇలా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ వచ్చేసింది.

అయితే ఇదే క్రేజ్ తో ఇప్పుడు విజయ్ దేవరకొండ బాలీవూడ్ లో ఓ 48 కోట్ల డీల్ సెట్ అయినట్లు, విజయ్ దేవరకొండ కి హీరోగా 48 కోట్ల పారితోషకం ఇస్తామని యాష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ ని అడిగినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ బ్రాండ్ అండ్ స్టయిల్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కి యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు పడిపోయి.. భారీ డీల్ తో విజయ్ తో మల్టీ లాంగ్వేజ్ మూవి ని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా కరణ్ జోహార్ సలహాతో ఆ ఆఫర్ ని కాదనలేకపోయాడనే న్యూస్ నడుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ 48 కోట్ల ఆఫర్ విషయం అంతా ఒత్తి గాసిప్పే అని, విజయ్ కి యష్ రాజ్ ఫిలిమ్స్ అసలు 48 కోట్ల డీల్ ఆఫర్ చేయలేదని, అదంతా కేవలం ఓ గాసిప్ అంటున్నారు

Tags:    

Similar News