కబీర్ సింగ్ ఫస్ట్.. సాహో గాయబ్

2019 లో బాలీవుడ్ లో, హాలీవుడ్ లో, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరి కొన్ని సినిమాలు [more]

Update: 2019-12-12 06:57 GMT

2019 లో బాలీవుడ్ లో, హాలీవుడ్ లో, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరి కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ సాధించాయి. కానీ ఒక్క బ్లాక్ బస్టర్ ,అంటే 500 కోట్ల క్లబ్బులో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా కాలు పెట్టలేకపోయింది. అయితే ఈ ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేసిన….. 2019 కి గాను ప్రేక్షకులు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ని విడుదల చేసింది. ఆ లిస్ట్ లో బాలీవుడ్ నుండి ‘కబీర్ సింగ్’ అదేనండి ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ ఫస్ట్ ప్లేస్ లో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత స్థానాల్లో హాలీవుడ్ మూవీస్ అవెంజర్స్: ఎండ్ గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్’ ఉండగా… మిగతా స్థానాల్లో బాలీవుడ్ మూవీ ‘సూపర్ 30, మిషన్ మంగళ్, గల్లీ బాయ్, వార్, హౌస్‌ఫుల్ 4, యూరి’ సినిమాలు ఉన్నాయి.

మరి ‘కబీర్ సింగ్’ టాప్ ప్లేస్ లో ఉండడం చూసిన వారికీ ఈ ఏడాది ఎన్నో అంచనాలు, భారీ ఆసక్తి తో విడుదలైన ‘సాహో’ సినిమా లేకపోవడం అంతే షాక్ కి గురిచేసింది. మరి ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ గురించి మట్లాడని వారు లేరు, సెర్చ్ చెయ్యని వారు లేరు. కానీ ‘సాహో’ ఇప్పుడు టాప్ 10 లిస్ట్ లో కనిపించకపోవడం మాత్రం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. మరి బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు నెలవుగా విడుదలైన ‘కబీర్ సింగ్’ టాప్ 1 లో ఉండడం మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్, ఆ సినిమాని యూత్ ని ఎంత ఎట్రాక్ట్ చేసిందో..అనేది దీని ద్వారా అర్ధమయ్యింది. మరి బాలీవుడ్ లో 300కోట్లకు పైగా వసూళ్లతో 2019సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ‘కబీర్ సింగ్’ ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ లో టాప్ లో నిలవడం.. ఓ టాలీవుడ్ డైరెక్టర్ (సందీప్ రెడ్డి) ఇంకేం కావాలి.

Tags:    

Similar News