మాది రైతు కుటుంబం

Update: 2018-07-12 09:24 GMT

తన తాత రైతు అని, తన తండ్రి కూడా తాను నాలుగో తరగతి చదివే వరకు రైతే అని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు. తమిళ హీరో సూర్య నిర్మాణంలో కార్తీ నటించిన చినబాబు చిత్రం వీడియోను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన రైతులపై ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతో ఆరాధించే నటుడి నిర్మాతగా, ఎంతో ఇష్టమైన నటుడు హీరోగా వస్తున్న చిత్రానికి సంబంధించన వీడియో విడుదల చేయడం సంతోషంగా ఉందని విజయ్ పోస్ట్ చేశాడు.

మీ నుంచి కొంత నేర్చుకోవాలి

దీనికి స్పందించిన సూర్య...విజయ్ కి కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే కలుద్దాం అని ట్వీట్ చేశారు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ సరే తలైవా, మీ నుంచి కొంత క్రమశిక్షణ నేర్చుకోవాలి అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

 

 

 

Similar News