విజయ్ – అట్లీ క్రేజ్ చూసారా..?

అట్లీ – విజయ్ కాంబోలో తెరకెక్కిన తేరి బ్లాక్ బస్టర్ హిట్. అయితే మెర్సల్ మాత్రం యావరేజ్ సినిమా అయినా.. విజయ్ క్రేజ్ తో అట్లీ – [more]

Update: 2019-04-17 06:05 GMT

అట్లీ – విజయ్ కాంబోలో తెరకెక్కిన తేరి బ్లాక్ బస్టర్ హిట్. అయితే మెర్సల్ మాత్రం యావరేజ్ సినిమా అయినా.. విజయ్ క్రేజ్ తో అట్లీ – విజయ్ కాంబో మీదున్న అంచనాలతో మెర్సల్ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో అదరగొట్టింది. అందుకే మరోసారి ఆ కాంబో మొదలవుతుంది అనగానే ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. విజయ్ 63గా మొదలైన ఈ సినిమాపై అప్పుడే ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. సినిమా మొదలైన కొద్ది రోజులకే… ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో మొదలైంది. ఇక 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో 50 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఏకంగా 30 కోట్ల‌కు

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓవర్సీస్ హక్కుల విషయంలోనూ విజయ్ – అట్లీల కాంబో రికార్డు ధర పలికిందని సమాచారం. విజయ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అందులోనూ రెండు సినిమాల బ్లాక్ బస్టర్ తో ఉన్న ఈ క్రేజీ కాంబో సినిమాకి ఇప్పుడు ఓవర్సీస్ లో భారీ ధర పలుకుతుందని… అందుకే నిర్మాతలు ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వారు 30 కోట్లు కోట్ చేసారని చెబుతున్నారు. రూ.30 కోట్లు ఇవ్వడానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సిద్దమవుతున్నారనే టాక్ వస్తుంది. మరి సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే ఈ రేంజ్ బిజినెస్ మొదలైంది అంటే షూటింగ్ కూడా పూర్తయితే.. సినిమా మీద మరెంత క్రేజ్ పెరుగుతుందో అని అంటున్నారు. ఇక త్వరలోనే విజయ్ – అట్లీ సినిమా భారీ షెడ్యూల్ మొదలు కాబోతుంది.

Tags:    

Similar News