సినిమా మొదలు పెట్టకముందే ప్రాఫిట్…?

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరో విజయ్ ఒక్కడే. రజనీకి వరుస ఫ్లాప్స్ రావడంతో ఆ స్థానాన్ని విజయ్ [more]

Update: 2019-03-23 08:14 GMT

తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరో విజయ్ ఒక్కడే. రజనీకి వరుస ఫ్లాప్స్ రావడంతో ఆ స్థానాన్ని విజయ్ తీసుకున్నాడు. విజయ్ తో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ పంట పండినట్టు. దాదాపు 200 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు విజయ్ లేటెస్ట్ మూవీ అట్లీతో చేస్తున్న చిత్రానికి కూడా బిజినెస్ అదేవిధంగా జరిగింది.

బిజినెస్ కూడా అయిపోయింది

తెరి’, ‘మెర్సిల్’ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చిన ఈ కాంబినేషన్ లో మూడో సినిమా కూడా రాబోతుంది. దీనిపై ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఏజీఎస్ సినిమాస్ వాళ్లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇలా షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో వెంటనే అలా బిజినెస్ జరిగిపోయింది. దీనికి వివిధ భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ.50 కోట్లకి అమ్ముడైపోయింది.

తెలుగులోనూ మంచి మార్కెట్

డిజిటల్ రైట్స్ ఇంతలా అమ్ముడైతే థియేట్రికల్ రైట్స్‌ కు ఎంత ధర వస్తుందో ఊహించవచ్చు. విజయ్ సినిమాలు తమిళనాడు వరకే కాదు గత కొన్నేళ్లలో అతడికి తెలుగులోనూ మార్కెట్ పెరిగింది. అలానే కేరళలో కూడా సమానంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇందులో విజయ్ సరసన నయనతార నటిస్తుంది. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    

Similar News