"రోషగాడు" గా విజయ్ ఆంథోని

Update: 2018-08-01 06:26 GMT

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చెస్తూ వస్తొన్న ఈ హీరో ఇప్పుడు రోషగాడుగా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో తిమిరపుడిచవాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఇవాళ సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చెయనున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి. అలాంటిది తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా , అంతే కమర్షియల్ టైటిల్ తో వస్తొన్న రోషగాడుతో విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

తారాగణం, సాంకేతిక వర్గం

నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా , డేనియల్ బాలాజీ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి

సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని, రచన-దర్శకత్వం: గణేష్, పిఆర్ఓ: సాయి సతీష్.

Similar News