తెలుగులో విజయ్… కన్నడనాట యశ్..!

కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని [more]

Update: 2018-12-26 06:33 GMT

కన్నడలో య‌శ్ హీరోగా ప్ర‌శాంత్‌ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై సంచలన విజయాన్ని మూట గట్టుకుంది. సినిమాకి తెలుగు, తమిళంలో మిక్స్డ్ రివ్యూస్ పడినప్పటికీ… తొలి 3 రోజుల్లో 58 కోట్ల నెట్ వ‌సూళ్లు సాధించిన కెజిఎఫ్ గ్రాస్ ప‌రంగా మొదటి వారంలోనే 100 కోట్ల క్ల‌బ్ లో చేరడం ఖాయంగా చెబుతున్నారు. తొలిరోజు టాక్ చూసి.. తెలుగు, తమిళంలో కెజిఎఫ్ కి థియేటర్స్ పెంచడంతో ఇక్కడ కూడా నెట్ వసూళ్లు పెరిగాయనేది తెలుగు, తమిళంలో కొన్న నిర్మాతల మాట. కన్న‌డ‌లో తొలి 100 కోట్ల క్ల‌బ్ చిత్రంగానూ కెజిఎఫ్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

విజయ్ తో పోలిక…

భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌, కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా మైమ‌రిపిస్తోంది. అయితే, కన్నడలో ఈ యంగ్ హీరో కెజిఎఫ్ తో 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం… తెలుగులో మరో యంగ్ హీరో కూడా ఈ ఏడాది స్టార్ హీరోల రేంజ్ లో 100 కోట్లు సాధించడంతో ఇద్దరినీ పోలుస్తున్నారు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ గీత‌ గోవిందం ఈ ఏడాది రిలీజై 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక డ్రైవ‌ర్ కొడుకైన య‌శ్ 100 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించ‌డం ఓ సెన్సేష‌న్ అంటూ యశ్ ని క్రిటిక్స్ తో సహా కన్నడ సినీప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News