మ‌రో బ‌యోపిక్ తీస్తున్న విద్యాబాల‌న్..!

నటి విద్య బాలన్ కి బియోపిక్స్ ఏమి కొత్త కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక రీసెంట్ [more]

Update: 2019-05-09 08:02 GMT

నటి విద్య బాలన్ కి బియోపిక్స్ ఏమి కొత్త కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్ర చేసిన ఈమె ఇప్పుడు మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి వెండితెరకు సంబంధించిన వాళ్ల‌ గురించి కాదు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతల దేవి బయోపిక్ లో నటించేందుకు విద్య ఓకే చెప్పింది.

క‌థ విన‌గానే ఓకే చెప్పిన విద్యాబాల‌న్

శకుంతల దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని అంటారు. ఎంత పెద్ద లెక్క అయినా ఆమె ఇట్టే సాల్వ్ చేసేది అని పేరు ఉంది. గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కిన శకుంతల దేవిపై బయోపిక్ రానుంది. దర్శకులు అను మీనన్ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశారు. కథ విన్న వెంటనే విద్య బాలన్ ఒప్పుకుందట. 2020 వేసవికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాను విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News