అక్కడ విద్య.. ఇక్కడ మమ్ముట్టి..!

గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ బాగా నటించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చక్కగా కుదిరాడు. కాకపోతే యంగ్ [more]

Update: 2019-02-09 04:01 GMT

గత నెలలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ బాగా నటించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ చక్కగా కుదిరాడు. కాకపోతే యంగ్ ఎన్టీఆర్ లుక్ లో బాలయ్య తేలిపోయినా ఆయన నడివయసు పాత్రకి బాలయ్య సరిగ్గా సరిపోయాడు. ఇక కథానాయకుడు సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా హైలెట్ అయ్యింది బసవతారకం పాత్రలో మెరిసిన విద్య బాలన్. ఎన్టీఆర్ భార్య బసవతారకం ప్రజలకు పెద్దగా తెలియని పాత్ర. అసలు బసవాతారకం ఆలా ఉంటారని ఏ ఫోటోనో చూసి చెప్పడం తప్ప ఆమెని రియల్ గా చాలా తక్కువ మంది చూసుంటారు. అందుకే కథానాయకుడిలో విద్య బాలన్ ని చూసిన వారు బసవతారం అంటే ఈవిడే అన్నట్టుగా విద్య నటన, హావభావాలు, ఆహార్యం అన్ని బసవతారకానికి సరిపోలికల్లా కనబడ్డాయి. విద్య బాలన్ బసవతారం లాగా అదరగోట్టేసిందని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా అన్నారు.

వైఎస్‌ను మ‌రిపించిన మమ్ముట్టి

ఇక తాజాగా యాత్ర సినిమాలో కూడా మమ్ముట్టి నటనకు, ఆయన వేషధారణకు మంచి కాంప్లిమెంట్స్ పడుతున్నాయి. వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాలో వైఎస్సార్‌ గా మమ్ముట్టి సరిగ్గా అతికారు. ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ మమ్ముట్టినే. సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. తన స్వంత స్టైల్ లో చేయడం చాలా ప్లస్ అయ్యింది. ఎమోషనల్ సీన్లలో మమ్ముట్టి చూపించిన ఇంటెన్సిటీ.. ఆ సన్నివేశాల్లో గాఢతను పెంచింది. సినిమా అంతా మమ్ముట్టి షోనే కనిపిస్తుంది. మరి నిజంగానే వైఎస్సార్ అంటే మమ్ముట్టి చేసిన పాత్ర‌ గుర్తుకు వచ్చేలా మమ్ముట్టి నటన యాత్రలో కనబడుతుంది.

Tags:    

Similar News