ఆ సినిమా చేస్తానంటే.. నన్ను పిచ్చిదానిలా చూసారు!!

బాలీవుడ్ లో ఎవరైనా బయో పిక్ లలో నటించాలంటే .. విద్య బాలన్ అయితే పర్ఫెక్ట్ అన్న రేంజ్ లో విద్య తన నటనతో అదరగొట్టేస్తుంది. సిల్క్ [more]

Update: 2020-08-11 11:13 GMT

బాలీవుడ్ లో ఎవరైనా బయో పిక్ లలో నటించాలంటే .. విద్య బాలన్ అయితే పర్ఫెక్ట్ అన్న రేంజ్ లో విద్య తన నటనతో అదరగొట్టేస్తుంది. సిల్క్ స్మిత బయో పిక్ డర్టీ పిక్చర్ దగ్గరనుండి.. నిన్నమొన్నటి శకుంతలాదేవి బయోపిక్ వరకు విద్య బాలన్ తప్ప ఆ కేరెక్టర్స్ మరెవ్వరికీ సూట్ కాదు, మరెవ్వరూ చెయ్యలేరు అనేంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయి నటించింది. అయితే సిల్క్ స్మిత డర్టీ పిక్చర్ సినిమాలో నటించేటప్పుడు విద్య బాలన్ ని పిచ్చిదానిలా చూసేవారట. మంచి హోమ్లీ పాత్రలు వేసుకునే విద్య ఇలాంటి డర్టీ పిక్చర్ చెయ్యడమేమిటా అని విద్య బాలన్ కి సలహాలు ఇచ్చేవారట. ఆ సినిమాకి సంతకం చేసినప్పుడు విద్యకేమైనా పిచ్చి పట్టిందా అన్నారట. కానీ దర్శకుడు మిలాన్ విద్య మీద నమ్మకం ఉంచి ఈ సినిమా ఆఫర్ ఇచ్చాడట. ఇక విద్య బాలన్ కూడా దర్శకుడి మీద నమ్మకం ఉంచి సినిమా ఒప్పుకుందట.

ఇక ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించింది. ఏక్తా కపూర్ తోనే విద్య తన కెరీర్ ని ప్రారంభించడంతో.. తనకు భద్రతగా ఉంటుంది అని ఈ సినిమా ఒప్పుకుందట. కానీ కొంతమంది మాత్రం పక్కింటి అమ్మాయిల ఉండే నీవు ఇలాంటి పాత్రలు చేస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని భయపెట్టారు అని అంటుంది విద్య. ఇక ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు విద్య బాలన్ తన తల్లితండ్రుల సలహా కూడా తీసుకుందట. విద్య పేరెంట్స్ కి సినిమాలకు సంబంధం లేకపోయినా.. నీకు నచ్చితే సినిమా చెయ్యి అని సలహా ఇచ్చారట. అప్పుడు నాకు నేనుగా ఆలోచించుకుని ఈ సినిమా చెయ్యడమే కరెక్ట్ అని భావించి  సినిమా చేశాను అంటుంది. మరి డర్టీ పిక్చర్ లో సిల్క్ స్మితగా విద్య బాలన్ నటించలేదు జీవించింది. కాబట్టే విద్యాబాలన్ కి జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా వచ్చింది.

Tags:    

Similar News