ఎన్టీఆర్ కోసం వచ్చేసింది

Update: 2018-07-04 03:21 GMT

రోజురోజుకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఏదొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తుండగా... ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విద్యాబాలన్ ఆ పాత్ర చేయడానికి కొన్ని షరతులు విధించిందంట.

ఆ షరతులుకు టీం అంగీకరించిన తరువాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విద్యాబాలన్. అయితే ఆ షరతులు ఏమిటన్నవి ఇంకా తెలియలేదు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఆమె ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. ముందుగా ఆమె పోర్షన్ ను దర్శకుడు క్రిష్ చిత్రీకరించనున్నట్టు సమాచారం.

బాలయ్య ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల బాలయ్య - విద్య బాలన్ కాంబినేషన్లోని సన్నివేశాలను ఆ తరువాత షూట్ చేస్తారు. మొదటినుండి విద్యాబాలన్ కు బరువైన పాత్ర చేయడంలో ఆమెకు పెట్టింది పేరు. తను చేసిన ప్రతి పాత్ర తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అందువలన ఆమె కారణంగా బసవతారకం పాత్రకు మరింత నిండుదనం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News