విద్య బాలన్ అటువంటి సినిమాలే చేస్తుంది

ఇప్పుడు ఇండియా బియోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ లో మహానటి సినిమా తరువాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో బసవ రామతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్‌కి ఆ [more]

Update: 2019-03-31 05:31 GMT

ఇప్పుడు ఇండియా బియోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ లో మహానటి సినిమా తరువాత వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో బసవ రామతారకం పాత్ర పోషించిన విద్యాబాలన్‌కి ఆ చిత్రంతో విజయం దక్కలేదు. ఈసినిమాకు పాన్ ఇండియా అప్పీల్‌ వస్తుందని అనుకున్నారు కానీ రాలేదు.

హిందీ లో కూడా ఈచిత్రం ని అనువాదం చేద్దాం అనుకున్నారు కానీ తెలుగులోనే డిజాస్టర్ అవ్వడంతో ఆ ఆలోచన మానుకున్నారు. పెళ్ళైన తరువాత సినిమా కెరీర్‌కి దాదాపు స్వస్తి పలికిన విద్యాబాలన్‌ ఈ చిత్రంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆమె ఏజ్ వెయిట్ కి తగ్గట్టు పాత్రలు వస్తున్నాయి.

ప్రస్తుతం బియోపిక్స్ హావ నడుస్తుంది కాబట్టి ఆమెకు అటువంటి పాత్రలే వరిస్తున్నాయి. జయలలితకి సంబంధించిన ఒక బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ చేస్తోన్న విద్యాబాలన్‌ త్వరలో మాయావతి బయోపిక్‌లో కూడా మాయావతి పాత్ర పోషించనుంది. త్వరలోనే వీటి వివరాలు తెలియనున్నాయి

Tags:    

Similar News