మరోసారి పోలీస్ ఆఫీసర్ గా వెంకీ?

Update: 2018-06-30 09:44 GMT

గురు సినిమా తర్వాత భారీ గ్యాప్ తో వెంకటేష్ ఒకేసారి మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. తేజ తో వెంకీ సినిమా ఆగిపోవడంతో..,, వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ తో పాటుగా బాబీ డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్ లో నాగ చైతన్య తో కలిసి మరో మల్టీస్టారర్ కి ఓకె చెప్పేసాడు. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా నేను లోకల్ డైరెక్షర్ త్రినాథ రావు నక్కిన కి మరో సినిమా కమిట్ అయ్యాడు వెంకీ. ఈ సినిమా కూడా మల్టీస్టారర్ గా ఉండబోతుందని.. అందులో ఒక హీరో వెంకటేష్ కాగా.. రెండో హీరో ని కోలీవుడ్ నుండి సూర్య ని తెస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే ఆ విషయంలో క్లారిటీ లేదుగాని..వెంకటేష్ త్రినాధరావు నక్కిన తో సినిమా చేస్తున్నాడని.. అది కూడా సురేష్ ప్రొడక్షన్ లోనే ఉండబోతుందనేది తెలిసిన సమాచారం. అయితే ఈ సినిమా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథతో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ వెంకీ - త్రినాధరావు నక్కిన కాంబోలో కథని సెట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ప్రసన్న కుమార్ మెరుగులు దిద్దుతున్న కథ రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో నడిచే ఓ పోలీస్ ఆఫీసర్ కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో కథకన్నా హ్యూమర్ కంటెంట్ బాగా ఇంప్రెస్ చేయడంతో వెంకటేష్ ఈ స్టోరీకి ఓకే చెప్పేశాడని తెలుస్తోంది.

మరి గతంలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టే సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితమోచ్చిన ఘర్షణ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ము దులిపాడు. ఇక తాజాగా త్రినాథ రావు నక్కిన సినిమాలో కూడా వెంకీ పోలీస్ గెటప్ లో అదరగొట్టేస్తాడంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సెట్స్ మీదున్నాడు. ఇక త్రినాధరావు -ప్రసన్న కుమార్ లు హీరో రామ్ తో హలో గురు ప్రేమ కోసమేరా సినిమా తో సెట్స్ మీదున్నారు. మరి ఇద్దరు తమ తమ సినిమాలు పూర్తి చేసుకుని అతి త్వరలోనే వెంకీ - త్రినాథ రావు ల సినిమా పట్టాలెక్కబోతుంది అనేది లేటెస్ట్ సమాచారం.

Similar News