విక్కీ కౌశల్ సినిమాలో కత్రినా..?

ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినబడుతున్న యంగ్ హీరో పేరు విక్కీ కౌశల్. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో హైలెట్ అయిన విక్కీ కౌశల్ [more]

Update: 2019-05-01 07:23 GMT

ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినబడుతున్న యంగ్ హీరో పేరు విక్కీ కౌశల్. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో హైలెట్ అయిన విక్కీ కౌశల్ హీరోగా నటించిన యురి ధి సర్జికల్ స్ట్రైక్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తాడు. ఆ యురి ధి సర్జికల్ స్ట్రైక్ సినిమా విడుదలయ్యాక హీరోయిన్స్ అందరూ అంటే సౌత్ భామలంతా విక్కీ కౌశల్ తో ఒక్క అవకాశం అంటూ వెంటపడుతున్నారు అంటే విక్కీ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక యురి ధి సర్జికల్ స్ట్రైక్స్ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడంతో విక్కీ కౌశల్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు వెంటబడుతున్నాడు.

హీరోయిన్ గా కత్రినా కైఫ్

తాజాగా విక్కీ కౌశల్… స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో జోడీ కడుతున్నాడని సమాచారం. యురి చిత్ర నిర్మాత రోన్ని స్క్రూవాలా విక్కీ కౌశల్ తో మరో సినిమాను ప్లాన్ చేశాడట. రియల్ లైఫ్ ప్రేమ కథను బేస్ చేసుకుని… ఈ సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో నిర్మాత ఉన్నాడట. ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీని రీల్ లైఫ్ లో చేసేందుకు విక్కీ కౌశల్ సిద్ధమవుతుండగా… విక్కీకి జోడీగా కత్రినా కైఫ్ ని నిర్మాత సంప్రదించాడని… విక్కీ కౌశల్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు కత్రినా కైఫ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే న్యూస్ బీటౌన్ లో వినబడుతుంది.

Tags:    

Similar News