అవి వెన్నెల ఫేట్ మార్చేస్తాయా?

బ్రహ్మానందం, సునీల్ లు కమేడియన్స్ గా తెరమరుగయ్యాక వెన్నెల కిషోర్ ఒక్కసారిగా దూసుకొచ్చేసాడు. వెన్నెల సినిమాతో వెన్నెల కిషోర్ గా మారాడు. వెన్నెలకిషోర్ కమెడియన్ గా వరసగా [more]

Update: 2019-08-07 06:08 GMT

బ్రహ్మానందం, సునీల్ లు కమేడియన్స్ గా తెరమరుగయ్యాక వెన్నెల కిషోర్ ఒక్కసారిగా దూసుకొచ్చేసాడు. వెన్నెల సినిమాతో వెన్నెల కిషోర్ గా మారాడు. వెన్నెలకిషోర్ కమెడియన్ గా వరసగా సినిమాలు చేస్తున్నాడు. అలా టాప్ కమెడియన్ గా వెన్నెలకిషోర్ పేరే వినవబడుతుంది. కానీ వెన్నెలకిషోర్ కామెడీ తో హిట్ అయిన సినిమాలేవీ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ దర్శకులకు మాత్రం వెన్నెలకిషోర్ కామెడీ ఉంటే సినిమా బావుంటుందని… హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో వెన్నెలను సినిమాల్లోకి దించుతున్నారు. మరి ప్రస్తుతం సినిమాల్లో కనబడుతున్న ఏకైక స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ మాత్రమే. ఇక సునీల్ చెయ్యాల్సిన పాత్రలన్నీ వెన్నెలకిషోర్ చేస్తున్నాడు.

మన్మధుడు తర్వాత….

తాజాగా మన్మధుడు 2 లో వెన్నెలకిషోర్, నాగార్జున తో కలిసి కామెడీ పండించబోతున్నాడు. మన్మధుడు 2 లో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్న వెన్నెల కిషోర్.. ఈసినిమాకి మెయిన్ హైలెట్ అంటుంది మూవీ టీం. రాహుల్ రవీంద్రన్ వెన్నెలకిషోర్ పాత్ర ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నాడట. మన్మధుడు 2 రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా వెన్నెల కిషోర్ కి మరో మంచి పాత్ర పడిందట. అది కూడా కామెడీ పంచ్ లతో అందరిని మైమరపింప జేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కతున్న సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ చేయబోతున్నాడట.

త్రివిక్రమ్ చేతిలో….

ఈ సినిమాలో సునీల్ కూడా ఉన్నాడనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా సునీల్ ని ఈ సినిమా నుండి తప్పించి.. వెన్నెల కిషోర్ పాత్రని త్రివిక్రమ్ హైలెట్ చేస్తున్నాడట. వెన్నెల కిషోర్ కోసం అద్భుతమైన పాత్రను త్రివిక్రమ్ ఈ సినిమాకోసమే రాశాడట. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ – వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని.. అలాగే సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ లో కూడా వెన్నెలకిషోర్ పగలబడి నవ్వేలా కామెడీ పండించేలా త్రివిక్రమ్ పంచ్ లు రాసాడట. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయితే.. నిజంగానే వెన్నెల కిషోర్ పెద్ద కమెడియన్ అయినట్లే.

Tags:    

Similar News