వెంకిమామని భయపెడుతున్న అంశం అదేనా..?

అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2 చిత్రం ప్రభావం మల్టీస్టారర్స్ పై బాగాపడింది. కామెడీ జోనర్ తో ప్రేక్షకులని కట్టి పడేసిన ఎఫ్ 2 చిత్రం ఇన్స్పిరేషన్ [more]

Update: 2019-02-25 06:29 GMT

అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2 చిత్రం ప్రభావం మల్టీస్టారర్స్ పై బాగాపడింది. కామెడీ జోనర్ తో ప్రేక్షకులని కట్టి పడేసిన ఎఫ్ 2 చిత్రం ఇన్స్పిరేషన్ గా తీసుకుని డైరెక్టర్ బాబీ వెంకీమామ సినిమా తీస్తున్నాడు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్క్రిప్ట్ లో అందుకు తగ్గట్టు భారీ మార్పులు చేర్పులు చేశారు. వెంకీ – చైతు నటిస్తున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా ఉన్నప్పటికీ టీంను భయపెట్టే విషయం ఏంటంటే సినిమాలో యాక్షన్ పార్ట్ తో పాటు ఎమోషనల్ సీన్స్ ఉండటమే. ఇందులో చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. చైతుకి యాక్షన్ ఇమేజ్ అచ్చురాదని గత సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.

ఎమోషన్ ఎక్కువయితే…

కాబట్టి ఇటువంటి పాత్ర చైతు చేయడం రిస్క్. మరోపక్క వెంకీతో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ప్లాన్ చేయడం మరో రిస్క్. వెంకీ ఎమోషనల్ సీన్స్ పండించడంలో దిట్ట. కానీ వెంకీ ఇప్పుడు అంతా కామెడీ యాంగిల్ లోనే చూస్తున్నారు. ఇది కూడా కొంతవరకు రిస్క్. సో ఎక్కువ కామెడీ ఉండి… తక్కువ శాతం ఎమోషన్స్ సీన్స్ ఉంటె మంచిది. నిన్నటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించబోతున్నారు.

Tags:    

Similar News