జ్యోతిష్యంతో మామా అల్లుళ్ల కామెడీ..!

Update: 2018-10-30 10:24 GMT

గత కొన్ని రోజులుగా వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించబోతున్న వెంకీ మామ సినిమా విషయాలు బాగా హైలెట్ అవుతున్నాయి. మాములుగా వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటించడం అంటేనే ఆ సినిమాపై ఆటోమాటిక్ గా అంచనాలు వచ్చేస్తాయి. బాబీ దర్శకత్వంలో ఈ వెంకీ మామ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ రెగ్యులర్ షూటింగ్ జరక్కపోయే సరికి ఈ సినిమా ఆగిపోయిందని, బాబీ చెప్పిన కథ పూర్తి స్థాయిలో సురేష్ బాబు కి నచ్చక పోవడంతో ఈ సినిమాని పక్కన పెట్టేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే, ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందని.. వెంకటేష్, నాగ చైతన్యలు రెగ్యులర్ షూటింగ్ కి హాజరవుతారని మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. ఇక రచయిత కోన వెంకట్ కూడా ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుందని చెబుతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 12వ తేదీన మొదలవుతుందని కూడా చెబుతున్నాడు.

పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా...

అయితే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనెర్ గా ఉండబోతుందనేది మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. కాకపోతే కామెడీతో కూడిన జ్యోతిష్యం చుట్టూనే ఈ వెంకీ మామ కథ ఉండబోతుందటనేది లేటెస్ట్ న్యూస్. వెంకీ మామ కథ అంతా కూడా జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుందని... జ్యోతిష్యం, నమ్మకాలు, గ్రహాలు.. వాటి ఫలితంగా మామా అల్లుళ్ల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు పూర్తి కామెడీతో కూడుకుని వుంటాయని చెబుతున్నారు. మరి మీడియం బడ్జెట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ లోనే నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి, నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ లు జోడి కడుతున్నారు.

Similar News