వెంకీ మామ అప్ డేట్స్..!

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. [more]

Update: 2019-03-11 08:19 GMT

నాగ చైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ గోదావరి పరిసరాల్లోని లొకేషన్స్‌ లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చైతు సరసన రాశీ ఖన్నా నటిస్తుండగా.. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్‌ నటిస్తుంది. ఇప్పటికే రాశీ ఖన్నా ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వగా.. పాయల్ రాజ్ పుత్ కూడా లేటెస్ట్ గా జాయిన్ అయింది.

మామాఅల్లుళ్ల కామెడీతో…

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయని సమాచారం. ఇందులో వెంకీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సురేష్ బాబుతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

Tags:    

Similar News