తప్పుకున్నాడా.. తప్పించారా?

నిన్న ఉగాది నాడు విడుదలైన సినిమాల ఫస్ట్ లుక్స్ హడావిడిలో ఒక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉగాది కానుకగా చాలా సినిమాలు టైటిల్ ని, [more]

Update: 2019-04-07 05:16 GMT

నిన్న ఉగాది నాడు విడుదలైన సినిమాల ఫస్ట్ లుక్స్ హడావిడిలో ఒక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉగాది కానుకగా చాలా సినిమాలు టైటిల్ ని, ఇంకొన్ని సినిమాలు ఫస్ట్ లుక్స్ ని, మరికొన్ని సినిమాలు ఉగాది స్పెషల్ పోస్టర్స్ ని విడుదల చేశాయి. అయితే నాగ చైతన్య – వెంకటేష్ కలిసి బాబీ దర్శకత్వంలో నటిస్తున్న వెంకిమామ ఫస్ట్ లుక్ ని కూడా ఉగాది కానుకగా వదిలింది వెంకిమామ టీం. అయితే ఆ ఫస్ లుక్ పోస్టర్ లో ఉండాల్సిన కోన వెంకట్ పేరు మిస్ అయ్యింది. ఇంతకీ కోన వెంకట్ మంచి రైటర్ మాత్రమే కాదు.. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక వెంకిమామ కి కోన వెంకట్ ముందు రైటర్ గానే పనిచేశాడు. కానీ మధ్యలో బాబీ తో విభేదాల వలన కోన ప్లేస్ లోకి వేరే రైటర్స్ వచ్చారన్నారు..

అయితే వెంకిమామ మొదలయ్యే ముందు.. మొదలయ్యే రోజు కూడా కోన వెంకట్ వెంకిమామ టీం లో కనిపించాడు. కానీ తాజాగా ఉగాది పోస్టర్ లో కోన పేరు ఆ పోస్టర్ లో లేదు. మరి వెంకిమామ విషయంలో సోషల్ మీడియాలో నానా హడావిడి చేసిన కోన ఇలా వెంకీ మామ నుండి తప్పుకోవడం కాస్త షాకింగ్. అయినా గత కొన్నాళ్లుగా సక్సెస్ లేని కోన వెంకట్ ని చాలామంది దర్శకులు వదిలేస్తున్నారు. కోన వెంకట్ నస తట్టుకోలేకే గతంలో హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల నే కోనా ని పక్కనబెట్టేసాడు. అయినా కొనకి శ్రీను కి బ్రేకప్ అయ్యాక అటు కోన, ఇటు శ్రీను వైట్ల ఇద్దరు సక్సెస్ కి దూరమయ్యారు. తాజాగా దర్శకుడు బాబీ కూడా కోన కి బ్రేకప్ చెప్పేసాడా? లేదంటే కొనానే కావాలని వెంకిమామ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా?అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News