విజయ్ దేవరకొండతో వెంకీ సినిమా..!

పోటీ చాలా ఎక్కువ ఉన్న సినీ రంగంలో ఒక డైరెక్టర్ కి సక్సెస్ రావడం అంటే మాములు విషయం కాదు. అది కూడా మొదటి సినిమాతోనే అంటే [more]

Update: 2019-01-24 07:42 GMT

పోటీ చాలా ఎక్కువ ఉన్న సినీ రంగంలో ఒక డైరెక్టర్ కి సక్సెస్ రావడం అంటే మాములు విషయం కాదు. అది కూడా మొదటి సినిమాతోనే అంటే అది వండర్ అనే చెప్పాలి. నటుడిగా, రచయితగా పరిచయమైన వెంకీ అట్లూరి రెండేళ్ల కిందట వరుణ్ తేజ్ తో తొలిప్రేమ అనే సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమానే సక్సెస్ అవ్వడంతో నాగార్జున నుండి పిలుపు వచ్చింది అఖిల్ ను డైరెక్ట్ చేయమని. అఖిల్ తో స్టార్ట్ చేసిన మొదటి రోజు నుండి ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.

డియర్ కామ్రేడ్ తర్వాత…

టీజర్, అఖిల్ లుక్, ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ఈ సినిమా ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా కూడా ఆడితే వెంకీకి బంపరాఫర్ దక్కడం గ్యారెంటీ అని టాక్. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే వెంకీ.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తాడు. రీసెంట్ గా విజయ్ కు వెంకీ ఓ కథ వినిపిస్తే కచ్చితంగా చేద్దాం అని చెప్పాడట. ‘డియర్ కామ్రేడ్’ తరువాత దీన్ని సెట్స్ మీదకు తీసుకోవచ్చే అవకాశముంది. చూద్దాం మిస్టర్ మజ్ను రిజల్ట్ ఏమవుతుందో.

Tags:    

Similar News