వెంకీ క్లారిటీ? అనిల్ అయోమయం?

అనిల్ రావిపూడి వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్ గా ఎఫ్ [more]

Update: 2020-08-25 08:19 GMT

అనిల్ రావిపూడి వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో తెరకెక్కించిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. దిల్ రాజు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చెయ్యడానికి రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ చేస్తే వెంకీ – వరుణ్ ల డేట్స్ తీసుకుందామని దిల్ రాజు చెప్పడంతో అనిల్ రావిపూడి కూడా సరిలేరు తర్వాత మరో కథ రాయకుండా ఎఫ్ 3 స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు కొత్త సినిమాల్తో బిజీ అయ్యారు. మధ్యలో కరోనా ఒకటి అనిల్ అసలా మీద నీళ్లు చల్లింది. అయితే వెంకీ – వరుణ్ లు సినిమాల్తో బిజీ కాబట్టి అనిల్ కూడా ఎఫ్ 3 కన్నా ముందు మరో యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

తాజాగా వెంకటేష్ ఇచ్చిన క్లారిటీ తో అనిల్  రావిపూడి అయోమయంలో పడ్డాడని అంటున్నారు. రానా పెళ్ళిలో హడావిడి చేసిన వెంకటేష్ కరోనా కారణంగా షూటింగ్ లకి హాజరవడం లేదు. తాజాగా ఆయన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 పై మట్లాడుతూ.. ఈ ఏడాది ఎఫ్ 3 చేసే అవకాశం లేదని తేల్చేసాడు. ప్రస్తుతం సెట్స్ మీదున్న షూటింగ్స్ కంప్లీట్ చేశాకే ఎఫ్ 3 అని చెప్పాడు. ఇక తన కొత్త చిత్రాలను సంక్రాంతి అనంతరమే సెట్స్ పైకి వెళ్ళతాయని వెంకీ స్పష్టం చెయ్యడంతో ఇప్పుడు అనిల్ రావిపూడి అయోమయంలోకి వెళ్లిపోయాడని టాక్ వినబడుతుంది. మరి వెంకీ – వరుణ్ లు ఫ్రీ అయ్యేలోపు అనిల్ రావిపూడి ఈ గ్యాప్ లో మరో సినిమా చేసిన చేయోచ్చు అని అంటున్నారు. 

Tags:    

Similar News