వెంకీ ఎక్కడ..?

తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన వెంకీ అట్లూరి.. ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన తొలిప్రేమ [more]

Update: 2019-03-27 07:45 GMT

తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన వెంకీ అట్లూరి.. ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాను ప్రేమ కథగా వెంకీ అట్లూరి మలిచిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. వరుణ్ తేజ్ కి రాశి ఖన్నాకి తొలిప్రేమ మంచి హిట్ ఇచ్చింది. ఇక వెంకీ అట్లూరికి కూడా మంచి ఆఫర్స్ రావడం.. వెంకీ మాత్రం అఖిల్ కి కనెక్ట్ అవడం జరిగింది. రెండు సినిమాల ఫ్లాప్స్ తో ఉన్న అఖిల్ తో వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను అంటూ ఒక లవ్ స్టోరీనే తెరకెక్కించాడు.

జాడ లేకుండా పోయిన వెంకీ

కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరింది. అప్పటికే రెండు డిజాస్టర్స్ తో ఉన్న అఖిల్ మళ్లీ మిస్టర్ మజ్నుతో డిజాస్టర్ అందుకున్నాడు. పాపం అఖిల్ దురదృష్టం వెంకీ అట్లూరికి కూడా అంటుకుంది. ఆ సినిమా తర్వాత అఖిల్, వెంకీ అట్లూరి చప్పుడు చేయడం లేదు. అయితే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వార్తలు మీడియాలో వినబడుతున్నాయి కానీ వెంకీ ఊసు మాత్రం ఎక్కడా వినబడడం లేదు. అఖిల్ 4వ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందనే టాక్ వినబడుతుంది. కానీ వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై ఎక్కడా వినిపించడం లేదు. మరి అందుకే అందరూ వేరీజ్ వెంకీ అంటున్నారు.

Tags:    

Similar News