వెంకిమామ రిలీజ్ డేట్ అందుకే ప్రకటించట్లేదు

వెంకటేష్ – నాగ్ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెంకిమామ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మొదట డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు [more]

Update: 2019-10-21 08:17 GMT

వెంకటేష్ – నాగ్ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వెంకిమామ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మొదట డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు కానీ మళ్లీ షూటింగ్ లేట్ అవుతుందని సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ డేట్ మార్చే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతవరకు డేట్ ని ఇంకా ఫైనల్ చేయలేకపోతున్నారు. దీని మెయిన్ కారణం అన్ని సినిమాల్లానే గాఫిక్స్ వర్కే సమస్య.

గ్రాఫిక్స్ పూర్తయితేనే…..

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగా వున్నాయి అని తెలిసిందే. ఆ గ్రాఫిక్స్ వర్క్ అసలు పూర్తి అవ్వడంలేదు. రీసెంట్ గా కొన్ని గ్రాఫిక్స్ వర్క్ చూసిన సురేష్ బాబు అవి నచ్చకపోవడంతో మళ్లీ చేయమని చెప్పినట్లు బోగట్టా. అందుకే రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు మేకర్స్. మంగళవారాని కి సురేష్ బాబు చెప్పిన గ్రాఫిక్స్ పూర్తి అవుతాయని అవి చూసి ఎప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది.

 

Tags:    

Similar News