100 కోట్ల క్లబ్ లో ….?

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తే అందులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం మాత్రం ఎఫ్ 2 ఒక్కటే. వెంకటేష్ – వరుణ్ తేజ్ నటించిన ఈ [more]

Update: 2019-01-25 06:37 GMT

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తే అందులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం మాత్రం ఎఫ్ 2 ఒక్కటే. వెంకటేష్ – వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ ని వసూలు చేసి రికార్డు నెలకొలిపింది.

దిల్ రాజు పంట పండింది…

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 50 కోట్లకి పైగా… వరల్డ్ వైడ్ గా 68 కోట్ల షేర్ ను రాబట్టింది. వరుణ్ తేజ్ కి, వెంకటేష్ కి 100 కోట్లు క్లబ్ రావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది రిలీజ్ అయ్యి మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ఇదే కావడం విశేషం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

 

Tags:    

Similar News